IPL 2021 CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

IPL 2021 CSK vs RR: ముంబై వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 19 April 2021 7:04 PM IST
Rajasthan Royals Won by Toss and Choose Bowling
X

ధోనీ, సంజూ శాంసన్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 CSK vs RR: ముంబై వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈమేరకు ధోనీ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఫస్ట్ మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయంతో టోర్నీలో బోణి కొట్టింది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి ఓవర్‌లో గెలిచింది. రెండో గెలుపు కోసం జరగనున్న ఈ పోటీలో పై చేయి ఎవరు సాధిస్తారో మరికాసేపట్లో తెలియనుంది.

ప్లేయింగ్ లెవన్

చెన్నై సూపర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, సామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), శివం దుబే, డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Venkata Chari

Venkata Chari

Next Story