logo
క్రీడలు

RR vs SRH: హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం

Rajasthan Royals Won by 55 Runs
X

రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

Highlights

RR vs SRH: రాజస్థాన్ నిర్దేశించిన 221 పరుగులను ఎస్‌ఆర్‌హెచ్ ఛేదించలేక 8 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.

RR vs SRH: రాజస్థాన్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేకపోయింది. 8 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

హైదరాబాద్ బ్యాట్‌మెన్స్ లో మనీష్ పాండే 31, జానీ బెయిర్ స్టో 30, కేన్ విలిమయన్స్ 20 మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. భారీ స్కోర్‌ ను ఛేదించే క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ.. ఓటమికి చేరువైంది.

రాజస్థాన్ బౌలర్లలో రహ్మాన్, మోరీస్ చెరో 3 వికెట్లు, త్యాగి, తెవాటియా తలో వికెట్ తీశారు.

అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ 221 పరుగుల భారీ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుంచింది. బట్లర్‌(124; 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సంజూ సామ్సన్‌(48) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌లో విఫలం కావడంతో రాజస్థాన్‌ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, విజయ్‌ శంకర్‌లు తలో వికెట్‌ తీశారు.

Web TitleRajasthan Royals Won by 55 Runs
Next Story