హైదరాబాద్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం

హైదరాబాద్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం
x
Highlights

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో చక్కని ప్రదర్శన కనబరిచిన రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో చక్కని ప్రదర్శన కనబరిచిన రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధశతకం చేశాడు. రాయల్స్‌ బౌలర్లలో వరుణ్‌ ఆరోన్, థామస్, శ్రేయస్‌ గోపాల్, ఉనాద్కట్‌ తలా 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాయల్స్ ఆటగాళ్లు సామ్సన్‌ (32 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. షకీబ్, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. ఉనాద్కట్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'అవార్డు అందుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories