రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు కోచ్ అతనే..!!

రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు కోచ్ అతనే..!!
x

టీం ఇండియా కోచ్ (ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ ఫోటో)

Highlights

మాజీ టీం ఇండియా క్రికెటర్, ది వాల్ అఫ్ ఇండియా క్రికెట్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఇండియా ఏ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Indian Cricket: మాజీ టీం ఇండియా క్రికెటర్, ది వాల్ అఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఇండియా ఏ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు భారత క్రికెట్ జట్టు కోసం యువ క్రీడాకారులను తీర్చి దిద్దుతున్న ద్రావిడ్ రానున్న కాలంలో భారత జట్టుకి కోచ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ రితిందర్ సింగ్ సోది తెలిపాడు. ప్రస్తుతం శ్రీలంక టూర్ లో ఉన్న ద్రావిడ్ భారత జట్టుకి తాత్కాలిక ప్రధాన కోచ్ గా వెళ్ళడమే దానికి ఉదాహరణ అంటూ రితిందర్ పేర్కొన్నాడు.

మరికొన్ని రోజుల్లో భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవి శాస్త్రి పదవి కాలం ముగుస్తుండటంతో పాటు ప్రస్తుత టీం ఇండియా శ్రీలంక టూర్ కి ద్రావిడ్ కోచ్ గా వెళ్ళడంతో తను చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీలంక టూర్ లో ఉన్న భారత జట్టు 3 వన్ డే మ్యాచ్ లు , 3 టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ జట్టుకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories