PBKS vs RCB: బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

Punjab Kings Won
x
పంజాబ్ టీం (ఫొటో ట్విట్టర్)
Highlights

PBKS vs RCB: 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘోరంగా ఓడిపోయింది.

PBKS vs RCB: 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు టీం ఘోరంగా ఓడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమై 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ అన్ని రంగాల్లో రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో 91 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ పడిక్కల్ ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్ కోల్పోయాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన పాటిదార్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డాడు. అయితే ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించేందుకు బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ తెగ ఇబ్బంది పడ్డారు. పంజాబ్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయారు బెంగళూరు బ్యాట్స్‌మెన్స్.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద హర్‌ప్రీత్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తరువాత ఎవ్వరూ క్రీజులో నిలువలేకపోయారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ ఓటమికి చేరువయ్యారు. పాటీదార్ 31 పరుగుల వద్ద జోర్దాన్ బౌలింగ్‌లో పూరన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ లో ఎవ్వరూ డబల్ డిజిట్ చేరకుండానే వికెట్ సమర్పించుకున్నారు. దీంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. చివర్లో హర్షల్ పటేల్(31) కొంత సేపు మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేసింద

ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ 3 వికెట్లు, రవి 2 వికెట్లు, మెరిడిత్, జోర్దాన్, షమీ తలో వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories