logo

విశాఖలో భారత క్రికెటర్లకు ఇబ్బందులు... బస్సు నిలబెట్టిన పోలీసులు

విశాఖలో భారత క్రికెటర్లకు ఇబ్బందులు... బస్సు నిలబెట్టిన పోలీసులు
Highlights

-విశాఖలో భారత క్రికెటర్లకు ఇబ్బందులు -ప్లాట్ ఫామ్ మూడులో బస్సు నిలబెట్టినపోలీసులు -వర‌్షంలో తడుస్తూ ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లిన క్రికెటర్లు -అసలే లగేజీ, ఆపై కుటుంబం వెంట ఉండటంతో తిప్పలు -వర్షంలో తడుసుకుంటూఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లిన క్రికెటర్లు

విశాఖలో భారత జట్టుకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసుకుని బయల్దేరిన భారత క్రీడాకారుల బస్సును ఎయిర్ పోర్టులో ఒకటవ నెంబర్ ప్లాట్ ఫామ్ లోకాకుండా మూడో నెంబర్ ప్లాట్ ఫామ్ పై పెట్టడంతో క్రీడాకారులు వర్షంలో తడుస్తూ లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అసలే లగేజీ, ఆపై కుటుంబ సభ్యులు కూడా ఉండటంతో వర్షంలో తడుసుకుంటూ వెళ్లాల్సి రావడంపై క్రీడాకారులు మండిపడ్డారు. పోలీసుల అవగాహనా లోపం వల్ల భారత జట్టు బస్సును ప్లాట్ ఫామ్ మూడులో నిలబెట్టారు.. దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన బస్సును ఒకటవ నెంబర్ ప్లాట్ ఫామ్ లో నిలపడంతో వారెలాంటి ఇబ్బందులు లేకుండా బస్ ఎక్కారు.పోలీసుల తీరుపట్ల భారత జట్టు క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు.


లైవ్ టీవి


Share it
Top