ప్లే ఆఫ్ రేసులో హర్యానా స్టీలర్స్

ప్లే ఆఫ్ రేసులో హర్యానా స్టీలర్స్
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ హర్యానా స్టీలర్స్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తుంది. జైపూర్ వేదికగా పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 39-34 తేడాతో హర్యానా విజయాన్ని అందుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ హర్యానా స్టీలర్స్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తుంది. జైపూర్ వేదికగా పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 39-34 తేడాతో హర్యానా విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ స్టార్ రైడర్ వికాస్ మరోసారి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం 24 సార్లు రైడ్‌కి వెళ్లిన వికాస్.. 13 పాయింట్లు సాధించించాడు. డిఫెండర్ రవి మూడు పాయింట్లను సాధించాడు. పట్నా జట్టులో పర్దీప్ 17 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ నీరజ్ 3పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్ లు ఆడిన హర్యానా స్టీలర్స్ పదకొండు విజయాలు నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

హర్యానా స్టీలర్స్ పై పోరాడిన పట్నా పైరేట్స్ మొత్తం 11 ఓటములతో 9వ స్థానానికి పడిపోయింది. ఇప్పటికే బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ, జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం జట్లు పోటీపడుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories