logo
క్రీడలు

Pro Kabaddi League 2021: కబడ్డీ.. కబడ్డీ.. నేటి నుండి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం

Pro Kabaddi League 2021 Starting From Today 22 12 2021
X

Pro Kabaddi League 2021: కబడ్డీ.. కబడ్డీ.. నేటి నుండి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం 

Highlights

Pro Kabaddi League 2021: ఐపీఎల్.. ప్రపంచకప్ ముగిసింది.. ఇక భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న...

Pro Kabaddi League 2021: ఐపీఎల్.. ప్రపంచకప్ ముగిసింది.. ఇక భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 8 నేడు ప్రారంభంకానుంది. మొత్తం 12 జట్లు బరిలో నిలిచాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సీజన్ 8 మొత్తాన్ని బెంగళూరులోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అభిమానులు లేకుండా నిర్వహిస్తున్నారు. 12 జట్లు బరిలోకి దిగుతున్న ఈ సీజన్ లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌ - 6 లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. 2022 ఫిబ్రవరి 26 న ఫైనల్‌తో ప్రో కబడ్డీ సీజన్‌ 8 ముగియనుంది.

నేటి మ్యాచులు:

యు ముంబా X బెంగళూరు బుల్స్ మ్యాచ్ రాత్రి గం. 7:30 నిమిషాలకు

తెలుగు టైటాన్స్ X తమిళ్ తలైవా‌స్‌ మధ్య మ్యాచ్ రాత్రి గం. 8:30 నిమిషాలకు

బెంగాల్‌ వారియర్స్ X యూపీ యోధా మధ్య రాత్రి గం. 9:30 నిమిషాలకు

ప్రో కబడ్డీ లీగ్ లో పాల్గొనే 12 జట్లు:

జైపూర్‌ పింక్‌ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, తమిళ్‌ తలైవాస్, యూపీ యోధ, బెంగళూరు బుల్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్‌ వారియర్స్, దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్, హరియాణా స్టీలర్స్.

Web TitlePro Kabaddi League 2021 Starting From Today 22 12 2021
Next Story