కూతకు రెడీ..

కూతకు రెడీ..
x
count down started for pro kabaddi season 7
Highlights

క్రీదాభిమానుల్ని ఊపేసిన క్రికెట్ ప్రపంచకప్ సందడి ముగిసింది. ఆ సందడి తెచ్చిన ఉత్సాహం ఇంకా పూర్తిగా చల్లరనే లేదు.. మన క్రీడాభిమానుల కోసం కూతేయడం కోసం...

క్రీదాభిమానుల్ని ఊపేసిన క్రికెట్ ప్రపంచకప్ సందడి ముగిసింది. ఆ సందడి తెచ్చిన ఉత్సాహం ఇంకా పూర్తిగా చల్లరనే లేదు.. మన క్రీడాభిమానుల కోసం కూతేయడం కోసం ప్రో కబడ్డీ సిద్ధం అయిపోతోంది. మన ఆట.. మన సంస్కృతి కబడ్డీ. క్రమేపీ ఆదరణ తగ్గుతోందని భావిస్తున్న తరుణంలో ప్రో కబడ్డీ పేరుతో లీగ్ ప్రారంభం అయింది. క్రికెట్ తరువాత మన దేశంలో పల్లె ముంగిళ్ల నుంచి పట్టణాల సందుల వరకూ ప్రతి సంవత్సరం ప్రోకబడ్డీ తన సత్తా చాటుతోంది. ఆటగాళ్లు కొదమ సింహాల్లా కూత పెడుతుంటే.. దేశవ్యాప్తంగా ప్రజానీకం ఊపిరిబిగబట్టి మరీ కబడ్డీని ఆస్వాదిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం 2014లో 8 టీములతో మొదటి ప్రోకబడ్డీ ప్రారంభం అయింది. ప్రారంభంలో ఎవరు చూస్తారులే అన్న వారందరి నోళ్లూ మూయిస్తూ క్రీదాభిమానులందరి తో కేక పెట్టించింది ప్రో కబడ్డీ. ఇప్పటి వరకూ ఆరు సీజన్ లు పూర్తయ్యాయి. ఈనెల 20న ఏడో సీజన్ మొదలవబోతోంది. ఈసారి మొత్తం 12 టీములు పాల్గోబోతున్నాయి.

మరో మూడు రోజుల్లో ప్రో కబడ్డీ సీజన్ 7 ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇప్పటి వరకూ ఆరు సీజన్లలో గెలుపు గుర్రం ఎక్కిన జట్ల వివరాలు..

సీజన్ 1 లో జైపూర్ పింక్ పాంథర్స్ ట్రోఫీ గెలుచుకుంది. సీజన్ 2 లో యూ ముంబై విజయం సాధించింది. సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 మూడు సీజన్లలో వరుసగా పాట్నా పైరట్స్ విజయకేతనం ఎగురేసి హ్యాట్రిక్ సాధించింది. ఇక సీజన్ 6లో బెంగళూరు బుల్స్ ట్రోఫీ గెలిచింది.

తెలుగు టైటాన్స్ ఇలా..

ఇప్పటివరకూ తెలుగు టైటాన్స్ రెండు సార్లు సెమీఫైనల్స్ కు వచ్చింది. కానీ ఒక్కసారి ఫైనల్ చేరలేకపోయింది. మొదటి సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ 492 పాయింట్లతో 5వ స్థానంలో ఉండిపోయింది. రెండో సీజన్లో 16 మ్యాచ్ లు ఆడి 586 పాయింట్లతో సెమీస్ చేరింది. కానీ యూ ముంబై చేతిలో పరాజయం పాలైంది. ఇక మూడో సీజన్ లో 14 మ్యాచ్ లు ఆది 427 పాయింట్లతో 5 వ స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగో సీజన్ లో మళ్లీ ఆశలు రేపిన టైటాన్స్ సెమీస్ చేరింది కానీ, ఈసారి బెంగళూర్ బుల్స్ చేతిలో ఖంగుతింది. దీంతో 506 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐదో సీజన్ కు ఎనిమిదో స్థానానికి పడిపోయింది టైటాన్స్. ఆరో సీజన్ లో టైటాన్స్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. చివరి స్థానంతో తన ప్రస్తానం ముగించింది. ఈసారైనా తెలుగు టైటాన్స్ తన సత్తా చాటి ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories