సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతాపై విజయం సాధించిన ఢిల్లీ

సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతాపై విజయం సాధించిన ఢిల్లీ
x
Highlights

ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ ఫెరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 186 పరుగుల విజయలక్ష్యంతో...

ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ ఫెరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో అంపైర్లు సూపర్ ఓవర్‌ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 10 పరుగులు చేయగా కోల్‌కతా జట్టు 7 పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 3 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్‌ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వసం సృష్టించాడు. దినేశ్‌ కార్తీక్‌ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులే చేసింది. పృథ్వీ షా (55 బంతుల్లో 99; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 99 పరుగులు చేసిన యువ ఆటగాడు పృథ్వీ షా కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories