రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం

రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం
x
Highlights

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులకు అవార్డులు దక్కాయి.

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులకు అవార్డులు దక్కాయి. పారా అథ్లెట్‌ దీపా మాలిక్ రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు స్వీకరించారు. ఖేల్‌రత్న అవార్డు దక్కించుకున్న మరో క్రీడాకారుడు బజరంగ్ పూనియా అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. రష్యాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్న కారణంగా ఫంక్షన్‌కు దూరంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో క్రీడా శాఖమంత్రి కిరణ్ రిజ్జు చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్నారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తెలుగు తేజం సాయి ప్రణీత్‌ రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా అర్జున్ అవార్డు అందుకున్నారు. మూడేళ్ల నుంచి కెరీర్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఈ 26 ఏళ్ల యువ షట్లర్‌కి 2018లోనే అర్జున అవార్డు వస్తుందని అంతా ఊహించారు. కానీ నిరాశే ఎదురవుతూ వచ్చింది. ఈ సారి కల నెరవేరింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.

బ్యాడ్మింటన్‌ కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన సాయి ప్రణీత్ 2017 నుంచి సంచలన ప్రదర్శనలకి మారుపేరుగా నిలుస్తూ వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సింగపూర్ ఫైనల్‌లో కిదాంబి శ్రీకాంత్‌ని ఓడించి మరీ టైటిల్ గెలిచిన ప్రణీత్ ఆ తర్వాత రెండు గ్రాండ్ ఫ్రిక్స్ గోల్డ్ టైటిల్స్ గెలిచాడు. విజయానికి చిరునామాగా నిలిచాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories