HBD Pollard: రికార్డ్‌ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ ఈ కరేబీయన్ హార్డ్ హిట్టర్

Pour Wishes From Mumbai Indians and Fans to This West Indies Kieron Pollard ‌Hitter
x

కీరన్ పోలార్డ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Happy Birthday Pollard: భారీ హిట్టింగ్‌లతో వెస్టిండీస్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన క్రీడాకారుల్లో కీరన్ పోలార్డ్ ఒకరు.

Happy Birthday Pollard: భారీ హిట్టింగ్‌లతో వెస్టిండీస్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన క్రీడాకారుల్లో కీరన్ పోలార్డ్ ఒకరు. టీ20 క్రికెట్‌కు కరెక్ట్ గా సూటయ్యే ఆటగాళ్లలో మొదటగా నిలుస్తాడు ఈ 6.5 అడుగుల ఆల్‌రౌండర్. ఎంతటి బౌలర్‌నైనా ఉతికి ఆరేసే కాపబులిటీస్ ఉన్న పోలార్డ్... నేడు(మే 12, 1987) 34 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.

ఈ సందర్భంగా.. ఈ హార్డ్ హిట్టర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీకోసం..

జననం: ట్రినిడాడ్‌లోని టకరిగ్వాలో 1987, మే12

వన్డేల్లో అరంగేట్రం: 2007 వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 10న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.


వన్డే స్టాట్స్: ఇప్పటివరకు 116 వన్డేలు ఆడిన 2564 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 54 వికెట్లు పడగొట్టాడు.


టీ20లో ఎంట్రీ: ఆస్ట్రేలియాతో 2008లో జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు.


టీ20 స్టాట్స్: ఇప్పటివరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1277 పరుగులు చేశాడు. 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ అరంగేట్రం: ముంబై ఇండియన్స్‌ తరఫున 2010లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు పొలార్డ్‌.


ఐపీఎల్ స్టాట్స్: టోర్నీలో ఇప్పటిదాకా 171 మ్యాచ్‌లు ఆడి 3191 పరుగులతో సత్తా చాటాడు. అలాగే 63 వికెట్లు తీశాడు.

ఒకే ఓవర్లో 6 సిక్సులతో సంచలనం: శ్రీలంకతో ఇటీవల జరిగిన మొదటి టీ20 లో కీరన్‌ పొలార్డ్‌ ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories