
పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెట్ కౌన్సిల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూతురు సనా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ రచించిన ది ఎండ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలోని ఓ సందేశాన్ని సనా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారని విపరీతంగా ప్రచారం నడుస్తుంది. ఈ చట్టంపై అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది. సనా పెట్టిన పోస్టుపై పలువురు స్వాగతించారని, మరికొందరు నెటిజన్లు వ్యతిరేకించారని వార్తలు వస్తున్నాయి.
తాజాగా దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. సనాను గంగూలీ వెనకెసుకొచ్చారు. వివాదాలకు సనాను దూరంగా ఉంచాలని గంగూలీ కోరారు. ఈ సందర్భంగా గంగూలీ ట్వీట్ చేశారు. తన కుమార్తె సనాను ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి, ఆమె పోస్టు పెట్టిన విషయం వాస్తవం కాదు, ఆమె చాలా చిన్న అమ్మాయి, తనకు రాజకీయాలు తెలియవు అంటూ గంగూలీ ట్వీట్ చేశారు.
Please keep Sana out of all this issues .. this post is not true .. she is too young a girl to know about anything in politics
— Sourav Ganguly (@SGanguly99) December 18, 2019
BCCI President @SGanguly99's daughter Sana Ganguly just won my heart by this post. Incredible maturity from an 18 year old. pic.twitter.com/wQN5eyfY6G
— Aparna (@chhuti_is) December 17, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




