IPL2020: ఐపీఎల్ అభిమానులకు షాక్.. ఈ సీజన్ మ్యాచుల నిర్వహణపై నీలినీడలు..

IPL2020: ఐపీఎల్ అభిమానులకు షాక్.. ఈ సీజన్ మ్యాచుల నిర్వహణపై నీలినీడలు..
x
Ipl 2020
Highlights

ఈ ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ -13 నిర్వహణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దానిపై సందిగ్ధత నెలకొంటుంది.

ఈ ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ -13 నిర్వహణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దానిపై సందిగ్ధత నెలకొంటుంది. మొదట అనుకున్నషెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29 ప్రారంభం కానుంది. అయితే అసలు ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ సెగ ఐపీఎల్‌కు తాకడమే. చైనాలో పుట్టిన కరోనా భారత్ తో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా భారత్‌లో కూడా వ్యాపించింది. కరోనా వైరస్ సోకిన కేసులు భారత్ లో 60పైగా నమోదైయ్యాయి. దీంతో ఐపీఎల్ నిర్వహించవద్దని చెన్నెై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఐపీఎల్‌ 2020 సీజన్‌ను నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్రం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో జి అలెక్స్‌ బెంజిగర్‌ అనే న్యాయవాది పిటిషన్‌ వేశారు. బెంజిగర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణనను డివిజన్ బెంచ్‌ జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, కృష్ణన్‌ రామస్వామి గురువారం చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్ కు మందును కనుగొన్నట్లు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించలేదు. దీంతో కరోనా ప్రపంచం మొత్తం విజృంభించడంతో ఇటలీ ఫెడరేషన్‌ లీగ్‌ను అభిమానులను అనుమతి ఇవ్వకుండా ఆ దేశ ప్రభుత్వం నిర్వహిస్తుందని బెంజిగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత చూపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ వాయిదా వేయాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె బీసీసీఐకి కోరారు. తాజాగా కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో.. అక్కడ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ లీగ్‌ను నిర్వహించేది లేదని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ కొనసాగుతుందని స్పష‌్టం చేశారు. ‎షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు జరుగుతోందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories