Pat Cummins: తూచ్.. విరాళంపై మ‌న‌సు మార్చుకున్న‌ ప్యాట్ కమిన్స్

PAtCummins Donation
x

ప్యాట్ కమిన్స్

Highlights

Pat Cummins: భారత్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

Pat Cummins: భారత్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనాపై భార‌త్ చేస్తున్న పోరాటానికి త‌న వంతు సాయం అందిస్తాన‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్ కమిన్స్ ప్ర‌క‌టించాడు. తాజాగా ప్యాట్స్‌ కమిన్స్ త‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. తాను ఇస్తానన్న విరాళాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి కాకుండా యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా సాయంతో అందించనన్నట్లు తాజాగా ప్రకటించాడు.

కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం ఈ ఆసీస్ పేస‌ర్ కమిన్స్‌ విరాళంగా 50 వేల డాలర్ల విరాళాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కోన్ని రోజుల‌కే రూట్ మార్చాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) భారత్‌కు 50 వేల డాలర్ల విరాళాన్ని యూనిసెఫ్‌ సాయంతో ఖర్చుపెట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కమిన్స్‌ కూడా అదే బాటను ఎంచుకున్నాడు. కమిన్స్‌ఇస్తానన్న రూ.37 లక్షలను 'యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా ద్వారా ఇండియా కొవిడ్‌-19 అప్పీల్‌'కు దానం చేశాడు.

కరోనాపై భారత్‌ సాగిస్తున్న పోరాటాని త‌న వంతుసాయం ప్ర‌క‌టించాడు కమిన్స్‌. విరాళాన్ని ప్రకటించిన వెంటనే అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇచ్చే విరాళాలు సరైన మార్గంలో వినియోగించబడటం లేదనే భావనలో ఉన్న కమిన్స్‌.. అందుకు యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా సాయంతోనే తన విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడ‌ని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories