10 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో టెస్ట్ సిరీస్..

Pakistan
x
Pakistan
Highlights

2009లో క్రికెట్ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌లో శ్రీలంక జట్టు పర్యటించింది. అయితే శ్రీలంక క్రికెటర్లు పర్యటిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విరుచుపడ్డారు....

2009లో క్రికెట్ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌లో శ్రీలంక జట్టు పర్యటించింది. అయితే శ్రీలంక క్రికెటర్లు పర్యటిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విరుచుపడ్డారు. అప్పటి నుంచి పాకిస్తాన్ లో పర్యటిచేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. మళ్లీ 2019లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు మాత్రమే శ్రీలంకలో అడుగుపెట్టారు. కీలక ఆటగాల్లు దూరంగా ఉన్నారు. భారీ బందోబస్తు నడుమ మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే అంతకముందు వరకూ పాక్ యూఏఈలోని పలు వైదానాల్లో క్రికెట్ ఆడింది.

అయితే పాక్ జట్టు మళ్లీ 10 ఏళ్ల తర్వాత సొంత దేశంలో టెస్టు క్రికెట్ ఆడనుంది. ఇటివలే పాక్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడిన శ్రీలంక జట్టు, టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది. డిసెంబరులో రెండు టెస్టుల మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక బోర్డును పాకిస్థాన్ ఒప్పించింది. రెండు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్‌ని ప్రకటించింది.

డిసెంబరు 11 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. రెండో టెస్టు 19 నుంచి జరగనుంది. మొదటి టెస్టు మ్యాచ్‌కు రావల్పిండి వేదికగా కానుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌కు కరాచీ వేదిక కానుంది. టూర్‌ని విజయవంతంగా నిర్వహించాలని పాక్ భావిస్తుంది. సిరీస్ విజయవంతంగా జరిగితే పాక్ క్రికెట్ కు మహార్థశ మొదలైనట్లే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories