టీ20ల్లో నెం.1 ఛాన్స్ కొట్టేసిన పాకిస్థాన్

టీ20ల్లో  నెం.1 ఛాన్స్ కొట్టేసిన పాకిస్థాన్
x
Highlights

పాకిస్థాన్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్ లు ఆడిన తోలిజట్టుగా రికార్డు సృష్టించింది ఆ జట్టు.. ఈరోజు లాహోర్ వేదికగా...

పాకిస్థాన్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్ లు ఆడిన తోలిజట్టుగా రికార్డు సృష్టించింది ఆ జట్టు.. ఈరోజు లాహోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడి ఈ ఘనతను అందుకుంది పాకిస్థాన్.. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్‌తో 2006 ఆగస్టులో తొలి టీ20 మ్యాచ్ ని ఆడింది పాకిస్థాన్. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకూ మొత్తం 149 మ్యాచ్‌లాడింది. ఇందులో పాక్ 90 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 55 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు టైగా ముగియగా ఒకదాంట్లో ఫలితం తేలలేదు.

ఇక భారత జట్టు అదే సంవత్సరం డిసెంబరులో దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ ఆడింది. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకూ 129 మ్యాచ్‌లు ఆడింది. అందులో 81 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 44 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక మిగిలిన నాల్గింటిలో ఫలితం తేలలేదు.

ఇక ఈరోజు భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలైంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ 20లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో టీ 20 మ్యాచ్ జనవరి 26 న జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories