
Pakistan Cricket Team: మీకు ఇదేం పోయేకాలం రా అయ్యా..! పని చేసే మహిళను కూడా వదలని పాక్ ఆటగాడు
Pakistan Cricket Team: టీ20 ప్రపంచకప్ జరుగుతున్న వేళ పాక్ జట్టులో భారీ వివాదం! శ్రీలంకలో హోటల్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన కీలక ఆటగాడు.
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. మైదానంలో వారి ఆట తీరు ఎలా ఉన్నా, మైదానం వెలుపల వారి ప్రవర్తన మాత్రం తరచూ వివాదాలకు దారితీస్తుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేళ పాక్ జట్టులో మరో తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం బయటపడింది. శ్రీలంకలోని ఒక ప్రముఖ హోటల్లో బస చేస్తున్న సమయంలో పాక్ జట్టుకు చెందిన ఒక కీలక ఆటగాడు అక్కడి మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి.
అసలేం జరిగింది?
ప్రపంచకప్ మ్యాచుల కోసం శ్రీలంకలో ఉన్న పాకిస్థాన్ జట్టు, అక్కడి ఒక లగ్జరీ హోటల్లో బస చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, జట్టులోని ఒక సీనియర్ ఆటగాడు హోటల్ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సదరు సిబ్బంది వెంటనే హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హోటల్ యాజమాన్యం ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో గందరగోళం మొదలైంది.
రంగంలోకి ఐసీసీ, పీసీబీ.. భారీ జరిమానా
ఈ ఘటనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. మహిళా భద్రత , క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో ఇరకాటంలో పడింది. ప్రాథమిక విచారణ అనంతరం, క్రమశిక్షణ ఉల్లంఘించిన సదరు ఆటగాడికి భారీగా జరిమానా విధించినట్లు సమాచారం. అయితే, టోర్నీ జరుగుతున్న సమయంలో జట్టు నైతికత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆ ఆటగాడి పేరును బోర్డు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు.
విమర్శల పాలవుతున్న పాక్ జట్టు
ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ జరుగుతున్న వేళ, దేశ గౌరవాన్ని కాపాడాల్సిన ఆటగాళ్లు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ జట్టుకు, ఈ వివాదం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఒకవైపు ఆటలో విఫలమవుతూ, మరోవైపు ఇలాంటి ప్రవర్తనతో దేశ పరువును అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలుపుతున్నారు అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పాక్ ఆటగాళ్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి, కానీ గ్లోబల్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఇలా జరగడం పాక్ క్రికెట్ చరిత్రలో ఒక నల్లని మచ్చగా మిగిలిపోనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




