ఆసియ కప్ రద్దు వార్తలపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం

ఆసియ కప్ రద్దు వార్తలపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం
x
PCB
Highlights

కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలైపోయాయి. ఈనేప‌థ్యంలో ప‌లు అంత‌ర్జాతీయ క్రీడాపోటీలు వాయిదా ప‌డ్డాయి.

కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలైపోయాయి. ఈనేప‌థ్యంలో ప‌లు అంత‌ర్జాతీయ క్రీడాపోటీలు వాయిదా ప‌డ్డాయి. కాగా.. ఆసియాకప్ నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఆసియాక‌ప్ నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధికారులు కూడా చెబుతున్నారు. ఎఫ్‌టీపీ మొత్తం దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ ఎప్పుడు నిర్వహించలన్న దానిపై కూడా స్పష్టత లేదన్నారు.

ఈ ఏడాది ఆసియాకప్‌ను నిర్వహిస్తే టీ20 వరల్డ్‌కప్ కోసం స‌న్న‌ద్ధం అయ్యే ఆసియా టీమ్‌లకు ఇది మంచి ట్రెయినింగ్‌లాగా ఉండేది. క్రికెట్ షెడ్యూల్ గురించి మాట్లాడేందుకు ఇదీ సరైంది కాదు. కోవిడ్ ప్ర‌భావంతో ఎఫ్‌టీపీ మొత్తం మారిపోయింది. అస‌లు ఏ దేశాలు క్రికెట్ ఏప్పుడు మొదలుపెడుతున్నాయో తెలియదు. కొన్నిదేశాల్లో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసియాకప్ జరగడం క‌ష్ట‌మేన‌ని బీసీసీఐ వ్యాఖ్యానించింది.

సెప్టెంబర్‌లో జరగాల్సిన‌ ఈ మెగాటోర్నీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు రావడంపై భారత్ అయిష్టత వ్యక్తం చేయడంతో తటస్థ వేదికలో మ్యాచ్ అడేందుకు పాక్ సిద్ద‌ప‌డింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో చర్చించి తుది వేదిక‌ల‌ను ఖారారు చేయాల్సి ఉంది. కరోనా వైరస్ వ‌ల్ల‌న ఏసీసీ స‌మావేశం జ‌ర‌గ‌లేదు. బీసీసీఐ కూడా టోర్నీ జరగడం కష్టమేనని తెలిపింది. దీంతో ఆసియాకప్ రద్దవుతుందనే ప్రచారం జ‌రుగుతోంది.

అయితే దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహ్సెన్ మణి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా‌కప్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏసీసీ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఆసీయాక‌ప్ పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్ల‌డించారు. వ‌చ్చే నెల ఆఖ‌ర్లో ఆసియాకప్‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటారని ఆసియా క్రికెట్‌ ‌బోర్డుల్లోని ఓ అధికారి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories