
PAK vs NAM: టీ20 వరల్డ్‌కప్ రికార్డులు.. వ్యక్తిగత స్కోర్లు, టీమ్ టోటల్స్‌లో పాకిస్థాన్ చరిత్ర!
PAK vs NAM Records: టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్‌లు, భారీ స్కోర్లతో అభిమానులను అలరించింది.
PAK vs NAM Records: టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్‌లు, భారీ స్కోర్లతో అభిమానులను అలరించింది. ముఖ్యంగా కొందరు బ్యాటర్లు కీలక మ్యాచ్‌లలో అసాధారణ ప్రదర్శనలు చేసి.. జట్టు రికార్డు బుక్స్‌లో తమ పేర్లు లిఖించుకున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ తరఫున నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్లు, అలాగే టీమ్‌గా సాధించిన భారీ టోటల్స్‌ను ఒకసారి చూద్దాం.
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ 111 నాటౌట్. ఈ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. షెహజాద్ ఈ ఇన్నింగ్స్‌ను మిర్పూర్ వేదికగా 2014లో బంగ్లాదేశ్ జట్టుపై ఆడాడు. రెండో స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్ ఉన్నాడు. అతడు ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై సెంచరీ (100 నాటౌట్) ఈ ఘనత సాధించాడు. మూడో స్థానంలో 94 పరుగులతో ఉమ్రాన్ అక్మల్ ఉన్నాడు. ఆస్ట్రేలియాపై మిర్‌పూర్ వేదికగా 2014లో అక్మల్ ఈ స్కోర్ నమోదు చేశాడు.
జట్టు స్కోర్ల విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ అత్యధికంగా చేసిన స్కోర్ 201/5. ఈ భారీ టోటల్‌ను 2016లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై నమోదు చేసింది. రెండో స్థానంలో 199/3 స్కోర్ ఉంది. ఇది ఈరోజు నమీబియాపై కొలంబో ఎస్‌ఎస్‌సీ మైదానంలో నమోదైంది. మూడో స్థానంలో 191/6 స్కోర్ ఉండగా.. 2010లో గ్రాస్ ఐలెట్ వేదికలో ఆస్ట్రేలియాపై సాధించింది. అలాగే 191/5 స్కోర్‌ను మరోసారి ఆస్ట్రేలియాపై 2014లో మిర్‌పూర్‌లో నమోదు చేసింది.
ఈ గణాంకాలు చూస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో పాకిస్థాన్ జట్టు దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా బ్యాటర్లు మెరుస్తూనే.. జట్టుగా కూడా భారీ స్కోర్లు ఇవ్వగల సామర్థ్యం పాక్ జట్టుకు ఉందని ఈ రికార్డులు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ సూపర్ 8కు చేరింది. నమీబియాపై విజయంతో పాకిస్థాన్ తదుపరి దశకు చేరుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




