Top
logo

Wimbledon 2021: వింబుల్డన్ ఫైనల్ కి చేరిన నోవాక్ జకోవిచ్

Novak Djokovic Entered in Wimbledon 2021 Final
X

నోవాక్ జకోవిచ్ (ఫైల్ ఫోటో)

Highlights

Wimbledon 2021: వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ సెమి ఫైనల్ లో అందరూ అనుకున్నట్టుగానే నోవాక్ జకోవిచ్ విజయం సాధించి ఫైనల్స్

Wimbledon 2021: వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ సెమి ఫైనల్ లో అందరూ అనుకున్నట్టుగానే నోవాక్ జకోవిచ్ విజయం సాధించి ఫైనల్స్ కి అడుగుపెట్టాడు. శనివారం ఓవర్ కాస్ట్ సెంటర్ కోర్టులో హోరాహోరిగా జరిగిన ఈ సెమీస్ లో కెనడియన్ ఆటగాడైన 22 ఏళ్ళ డెనిస్ శాపవాలోవ్ పై 7-6,7-5,7-5 పాయింట్లతో ఘన విజయం సాధించాడు. ఇక ఇప్పటివరకు 19 గ్రాండ్ స్లాం టైటిల్స్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్ తాజాగా ఈ వింబుల్డన్ గ్రాండ్ ఫైనల్లో గెలుపొందితే ఇప్పటివరకు 20 గ్రాండ్ స్లాం టైటిల్స్ ని గెలుచుకున్న రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ లిస్టు లో చేరనున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ లో ఈ సెర్బియన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ 25 ఏళ్ళ ఇటాలియన్ ఆటగాడు అయిన మ్యాటియో బెరేట్టిని తో తలపడనున్నాడు.

మరోపక్క మహిళల టెన్నిస్ లో ఇప్పటికే ఫైనల్ చేసిన ఆష్ బార్తితో కరోలిన ఆదివారం తలపడనుంది. దీంతో జరగనున్న ఈ ఫైనల్స్ లో పురుషుల, మహిళల టెన్నిస్ ప్రపంచ ఛాంపియన్ ఎవరో తేలనుంది. పురుషుల విభాగంలో నోవాక్ జకోవిచ్, మహిళా విభాగంలో ఆష్ బార్తిలు ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ స్లాం ఫైనల్ లో వీరిద్దరి గెలుపు ఖాయమని క్రీడా పండితులు జోస్యం చెబుతున్నారు.

Web TitleNovak Djokovic Entered In Wimbledon 2021 Final | Wimbledon Tennis News 2021
Next Story