అదిరిపోయే క్యాచ్‌..మిస్ అయితే మళ్లి చూడలేరు

అదిరిపోయే క్యాచ్‌..మిస్ అయితే మళ్లి చూడలేరు
x
Highlights

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది.

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటాగాడు హెన్రీ నికోలస్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్‌గా నిలిచింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ పేసర్ నీల్‌ వాగ్నర్‌ వేసిన 105వ ఓవర్‌ను పేస్ చేయడానికి ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్ ఇబ్బంది పడ్డాడు. నీల్‌ వాగ్నర్‌ విసురుతున్న గుడ్ లెంగ్త్ డెలవరీలు బౌన్సర్లు ఎదుర్కొవడంతో స్టీవ్‌ స్మిత్ ఇబ్బంది పడ్డాడు.

నీల్‌ వాగ్నర్‌ వేసిన 104 ఓవర్లో నాలుగో బంతిని ఎదుర్కొవడంలో స్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్ తడబడ్డాడు. కచ్చితమైన షార్ట్ పించ్ బంతిని అర్ధం చేసుకోలేక నిలువరించాలనే క్రమంలో బ్యాట్ అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ బంతి కాస్త బ్యాట్ అంచుకు తాకి గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్‌ ఒక్క చేతితో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అతనిపై నుంచి వెళ్తున్న బంతిని గాల్లోకి డైవ్ కొట్టి నికోలస్ అందుకున్నాడు. దీంతో చేతికి అందకపోయినా రెండు వేళ్లతో బంతిని పట్టుకున్నాడు. దీంతో సెంచరీ చేస్తాడనుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 85 పరుగులు చేసి వెనుదిరిగాడు.

అంతకుముందు తొలి రోజు 257/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా‌ రెండో రోజు 467 పరుగులు చేసిన ఆలౌటైంది. 27 పరుగులు జత 284 వద్ద న్యూజిలాండ్‌ హెన్రీ నికోలస్‌ అద్భుత క్యాచ్‌తో స్టీవ్ స్మిత్‌ వికెట్‌ను కోల్పోయింది. ఇక ఆస్టేలియా ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌(114) సెంచరీ సాధించగా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(79) అర్ధశతకాలతో రాణించాడు. 467 పరుగులకు ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. టామ్ (9) రాస్ టేలర్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామిక్స్, జేమ్స్ చేరో వికెట్ దక్కించుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories