Team India Coach : టీమిండియాకు నయా కోచ్.. ఆస్ట్రేలియాను కొట్టేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్

Nicholas Lee Appointed as India Womens S&C Coach
x

Nicholas Lee Appointed as India Women's S&C Coach

Highlights

టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. బీసీసీఐ మహిళా జట్టుకు సంబంధించి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.

Team India Coach : టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. బీసీసీఐ మహిళా జట్టుకు సంబంధించి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. జట్టు ఫిట్‌నెస్ ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో, ఇంగ్లాండ్‌కు చెందిన సీనియర్ ట్రైనర్ నికోలస్ లీని జట్టు కొత్త స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించింది. నిన్న మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సేవలు అందించిన ఈయన, త్వరలో హర్మన్‌ప్రీత్ సేనతో కలిసి పనిచేయనున్నారు.

ప్రస్తుతానికి నికోలస్ లీ నియామకం ఖరారైనప్పటికీ, ఆయన నేరుగా రంగంలోకి దిగడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాతే ఆయన భారత మహిళల జట్టుతో చేరనున్నారు. ఈ ఏడాది WPL జనవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 5న ముగుస్తుంది. ఈ టోర్నీలో ప్లేయర్లు బిజీగా ఉన్నందున, లీ తన బాధ్యతలను ఫిబ్రవరి రెండో వారం నుంచి చేపట్టే అవకాశం ఉంది.

నికోలస్ లీ రాకతో టీమిండియా ఎదుర్కోబోయే మొదటి పెద్ద సవాలు ఆస్ట్రేలియా పర్యటన. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు సాగే ఈ టూర్ చాలా కీలకం. ఆస్ట్రేలియా గడ్డపై ఫిజికల్ ఫిట్‌నెస్, స్టామినా చాలా అవసరం. కంగారూల దేశంలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో ప్లేయర్లు గాయాల బారిన పడకుండా చూడటమే నికోలస్ లీ ముందున్న ప్రధాన లక్ష్యం.

నికోలస్ లీ కేవలం కోచ్ మాత్రమే కాదు, ఆయనకు క్రికెట్ గ్రౌండ్‌లో ప్లేయర్‌గా కూడా మంచి పట్టు ఉంది. ఆయన ఇంగ్లాండ్ కౌంటీల్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 490 పరుగులు చేశారు. ఇక ట్రైనర్‌గా ఆయన ప్రయాణం అద్భుతం.

ఆఫ్ఘనిస్తాన్ (2024-2025): ఆఫ్ఘన్ ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.

బంగ్లాదేశ్ (2020-2024): అక్కడ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ హెడ్‌గా పనిచేశారు.

శ్రీలంక (2016-2020): లంక పురుషుల జట్టుతో కలిసి నాలుగేళ్లు పనిచేశారు.

ససెక్స్ (2012-2016): కౌంటీ క్రికెట్‌లో లీడ్ ట్రైనర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

భారత మహిళా జట్టు ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలుపు జోరును కొనసాగించాలంటే ప్లేయర్లలో చురుకుదనం పెరగాలి. విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ పొందితే కొత్త టెక్నిక్స్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ మెథడ్స్ ప్లేయర్లకు అలవడతాయని బీసీసీఐ భావిస్తోంది. నికోలస్ లీ రాకతో కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా, ఫీల్డింగ్‌లో కూడా భారత అమ్మాయిలు మెరుపులు మెరిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories