బంగ్లాదేశ్‌ నిలుస్తుందా?

బంగ్లాదేశ్‌ నిలుస్తుందా?
x
Highlights

భారత్ బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండోర్ వేధికగా రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రేపు ఆరంభం కానుంది....

భారత్ బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండోర్ వేధికగా రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రేపు ఆరంభం కానుంది. ఒకరకంగా రెండు టెస్టుల సిరీస్ బంగ్లాకు పెద్ద పరీక్షే పెట్టనుంది. ముఖ్యంగా భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం బంగ్లాకు సవాలే. బుమ్రా లేకపోయినా మహ్మద్ షమి, ఇషాంత్‌శర్మ, ఉమేశ్‌యాదవ్‌లతో భారత పేస్ విభాగం బలంగా ఉంది. టీ20లతో భారత్‌కు గట్టిపోటీ ఇచ్చిన బంగ్లాదేశ్‌ టెస్టుల్లో నెగ్గుకు రావడం అంత సులభం కాబోదంటున్నారు క్రీడా విశ్లేషకులు.

చరిత్ర చూసుకున్నా రికార్డుల లెక్కలు తీసినా భారత్ చేతిలో బంగ్లాకు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. చివరగా ఈ రెండు జట్లు 2017లో ఆడితే అందులో భారతే నెగ్గింది. టీమ్ ఇండియా పేస్ మునుపెప్పుడూ లేనంత పదునుగా ఉందిప్పుడు. ఈ స్థితిలో బంగ్లా మనల్ని ఎదుర్కొని నిలవగలదా చూడాలి. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లోనూ బంగ్లా ఇన్నింగ్స్ 224పరుగులతో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories