NZ XI vs IND :మారని టీమిండియా ఆటతీరు.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆదుకున్న ఆ ఇద్దరు

NZ XI vs IND :మారని టీమిండియా ఆటతీరు..  ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆదుకున్న ఆ ఇద్దరు
x
New Zealand XI vs India
Highlights

న్యూజిలాండ్ భారత జట్ల మధ్య ద్వైపాక్షక సిరీస్‌ జరుగుతుంది. అందులో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ముందు హామిల్టన్ వేదికగా శుక్రవారం కివీస్ ఎలెవన్ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆరంభమైంది.

న్యూజిలాండ్ భారత జట్ల మధ్య ద్వైపాక్షక సిరీస్‌ జరుగుతుంది. అందులో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ముందు హామిల్టన్ వేదికగా శుక్రవారం కివీస్ ఎలెవన్ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా కు ఓపెనర్లుగా దించింది. అలాగే నాలుగో బ్యాట్స్ మెన్ శుభమ్ గిల్ ని దింపింది. హనుమ విహారిని జట్టులోకి తీసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లు మయాంక్, పృథ్వీ షాను ఓపెనర్లుగా రంగంలోకి దింపింది. మరోసారి వీరి జోడీ విఫలమైంది. పృథ్వీ డకౌటవ్వగా, మయాంక్‌ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియాను హనుమ విహారి(101, 182బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సు)లతో అజేయ సెంచరీ సాధించాడు. పుజారా (93, 211బంతుల్లో,11 పోర్లు, 1 సిక్సు) రాణించాడు. అనంతరం విహారి రిటైర్డ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ 263 పరుగులు చేయగలిగింది. రహానే(18), రిషబ్ పంత్(7) పరుగులతో నిరాశపరిచారు. సహా(0)అశ్విన్(0) జాడేజా(8) పరుగులు చేసి విఫలమైయ్యారు. దీంతో 78.1ఓవర్లులో 263 పరుగల తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ బరిలోకి దిగలేదు.

'భారత్‌-ఎ' మ్యాచ్‌లలో శుభమ్ గిల్‌ చెలరేగాడు. అనధికారిక తొలి టెస్టులో 83, 204 అజేయంగా డబుల్ సెంచరీతో రాణించాడు. రెండో టెస్టులో 136 స్కోర్లతో రాణించాడు. కానీ, కివీస్ ఎలెవన్ తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గిల్ కూడా విఫలమవ్వడం భారత్ ను కలవరపెడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుంది. మయాంక్, షా, గిల్ విఫలం కావడంతో ముగ్గురిలో ఓపెనర్లుగా అవకాశం దక్కుతుంది చూడాలి. అయితే ఈ మ్యాచ్ ల విహారి సక్సెస్ కావడం భారత్ కు కొంత ఉపసమనం కలిగించేలా ఉందని చెప్పాలి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories