‍‍NZ XI Vs IND : టీమిండియా పేస్ దెబ్బకి కివీస్ ఎలెవన్ ప్యాకప్

‍‍NZ XI Vs IND : టీమిండియా పేస్ దెబ్బకి కివీస్ ఎలెవన్ ప్యాకప్
x
Ind Vs NZ XII
Highlights

న్యూజిలాండ్ ఎలెవన్‌ భారత జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు టీమిండియా పైచేయి సాధించింది.

న్యూజిలాండ్ ఎలెవన్‌ భారత జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు టీమిండియా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ దళం అదరగొట్టింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఎలెవన్‌ టీమిండియా బౌలర్ల దాటికి 235పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(23), పృధ్వీ షా(35) తో పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఇప్పటికే 87పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్లలో విల్‌ యంగ్‌(2)ను బుమ్రా ఔట్‌ చేయగా.. టిమ్‌ సీఫెర్టీ(9)ని షమీ పెలివియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రచిన్‌ రవీంద్ర(34), ఫిన్‌ అలెన్‌(20), హెన్రీ కూపర్‌(40), టామ్‌ బ్రూస్‌(31), మిచెల్‌(32)లు రాణించడంతో కివీస్ ఎలెవన్ 235 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్ల సత్తాచాటాడు.‎ జస్‌ప్రీత్‌ బుమ్రా, సైనీ, ఉమేశ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే కివీస్ ఎలెవన్ బ్యాట్స్ మెన్ 10 వికెట్లలో 9 వికెట్లు పేస్‌ బౌలర్లు సాధిస్తే, స్పిన్నర్‌ అశ్విన్‌కు వికెట్‌ దక్కించున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ పేస్ బౌలర్లు ఫామ్‌లోకి రావడం శుభసూచికం.

మొదటి రోజు భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియాను హనుమ విహారి(101, 182బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సు)లతో అజేయ సెంచరీ సాధించాడు. పుజారా (93, 211బంతుల్లో,11 పోర్లు, 1 సిక్సు) రాణించాడు. అనంతరం విహారి రిటైర్డ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ 263 పరుగులు చేయగలిగింది. రహానే(18), రిషబ్ పంత్(7) పరుగులతో నిరాశపరిచారు. సహా(0)అశ్విన్(0) జాడేజా(8) పరుగులు చేసి విఫలమైయ్యారు. దీంతో 78.1ఓవర్లులో 263 పరుగల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories