IND vs NZ 3rd T20 : హిట్.. హిట్.. రోహిత్.. ఉత్కంఠ పోరులో విజయం

IND vs NZ 3rd T20 : హిట్.. హిట్.. రోహిత్.. ఉత్కంఠ పోరులో విజయం
x
IND V NZ
Highlights

న్యూజిలాండ్‌లోని హామిల్టాన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్‌లోని హామిల్టాన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదట టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (11), గుప్తిల్ (5) పరగులు చేశారు. ఒక బై లభించింది. సూపర్ ఓవర్ బౌలర్ బుమ్రా వేశాడు.

బ్లాక్‌క్యాప్స్ నిర్ధేశించిన 18 పరుగుల విజయ లక్ష్యంలో టీమిండియా బరిలోకి దిగింది. ఈ సూపర్ ఓవర్ లో రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్, రాహుల్ క్రీజులోకి వచ్చారు. కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీకి బంతిని అప్పగించాడు. తొలి బంతికి రోహిత్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఇక స్ట్రెక్ వచ్చిన రాహుల్ బౌండరీ తీశాడు. నాలుగో బంతిని సింగిల్ తీసి రోహిత్ ఇచ్చాడు. దీంతో చివరి రెండు బంతులకు విజయానికి 8 పరుగులు అవసరం ఉండగా రెండు సిక్సులు బాది రోహిత్ విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన భారత్ నిరీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. మొదటి రెండు మ్యాచ్ లలో తక్కువ స్కోర్ కే పరిమితమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో తనదైన శైలిలో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతుల్లో 65 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ ఫార్మేట్లలో ఓపెనర్గా పదివేల పరుగుల మైలు రాయిని దాటాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ ల తరువాత ఈ మార్క్ ను అందుకున్న నాలుగో బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన వారిలో రోహిత్ 21వ వాడు. కోహ్లీ 38 పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో హామీష్ బెన్నెంట్ మూడు వికెట్లు పడగొట్టాడు.

భారత్ నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్లాక్‌క్యాప్స్ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (95 పరుగులు ,48 బంతుల్లో, 8 ఫోర్లు, 6 సిక్సర్లో)తో టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయాడు. కివీస్ ఓపెనర్ గుప్టిల్ (31)పరుగులతో రాణిచాడు. కివీస్ విజయానికి మూడు బంతుల్లో రెండు పరుగుల కావాల్సిన సమయంలో షమీ బౌలింగ్‌లో ‎యత్నించి విలియమ్సన్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అనూహ్యంగా టై అయింది. భారత బౌలర్లలో శార్థుల్ ఠాకూర్, షమీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చాహల్ , జడేజా చెరో వికెట్ తీసుకుని సత్తాచాటారు. నాలుగో టీ20 జనవరి 31 శుక్రవారం విల్లింగ్టన్‌లో జరగనుంది.


65(40) followed by 15(4) in #SuperOver.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories