
న్యూజిలాండ్-భారత్ మధ్య ఆఖరి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేలకు సిరీస్ 3-0 కైవసం చేసుకుంది. టీ20 ఓటమికి కివీస్...
న్యూజిలాండ్-భారత్ మధ్య ఆఖరి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేలకు సిరీస్ 3-0 కైవసం చేసుకుంది. టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ నిర్ధేశించిన 297 పరుగుల విజయం లక్ష్యంతో కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ అద్భుతంగా ఆడారు. హెన్రీ నికోల్స్(80 పరుగులు,103 బంతుల్లో,9ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం అందించారు.
అయితే ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్‌ను చాహల్ బొల్తా కొట్టించాడు. మార్టిన్ గప్టిల్ క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ విలీయమ్స్(12), రాస్ టేలర్(22), తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. వారి తర్వాత వెంటన్ నికోలస్ కూడా వెనుదిరిగాడు. దీంతో గెలపు భారత్ వైపు మళ్లింది. అయితే లాథమ్(32), గ్రాండ్ హోమ్(58,28 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో కివీస్ అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీసుకోగా.. జడేజా, ఠాకుర్ చెరో వికెట్ దక్కిచుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రాస్ టేలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ అందుకున్నారు.
అంతకముందు టాస్ గెలిచిన కివీస్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), విరాట్ కోహ్లి (9) నిరాశపరిచినా, మరో ఓపెనర్ పృథ్వీ షా (42 పరుగులు బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2)రాణించారు. శ్రేయాస్ అయ్యర్ (63 పరుగులు బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2)తో మరోసారి సత్తాచాటాడు.
ఈ మ్యాచ్ లో 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను రాహుల్ (112 పరుగులు, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్)ల సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఈ దశలో భారత్ 300 పైచిలుకు పరుగులు చేస్తారనుకున్న సమయంలో.. ఇన్నింగ్స్ 47 ఓవర్‌లో వరుస బంతుల్లో రాహుల్, మనీష్ ఔట్ కావడంతో భారత్ 300 మార్కు దగ్గరలో ఆగిపోయింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్‌కు నాలుగు వికెట్లు పడగొట్టగా.., నీషమ్, జేమీషన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




