పాపం న్యూజిలాండ్.. కలిసిరాని సూపర్ ఓవర్

పాపం న్యూజిలాండ్.. కలిసిరాని సూపర్ ఓవర్
x
Highlights

సూపర్ ఓవర్.. క్రికెట్ లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆ రెండు జట్లు సమానమైన పరుగులు చేసినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

సూపర్ ఓవర్.. క్రికెట్ లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆ రెండు జట్లు సమానమైన పరుగులు చేసినప్పుడు దీనిని ఉపయోగిస్తారు. ఆరు బంతుల్లోనే పరుగులు చేసి ప్రత్యర్ధిని ఆ పరుగులు చేయకుండా కట్టడి చేయాలి. వాస్తవానికి అప్పటి మ్యాచ్ ఒకెత్తు అయితే ఈ ఆరు బంతులు మరో ఎత్తు అని చెప్పాలి. దీనికి మైండ్ గేమ్ కావాలి. ప్రత్యర్ధి జట్టులో బలాబలాలు అప్పటికప్పుడు అంచనా వేయాలి. దీనితో పాటు అదృష్టం కూడా అవసరమే..

తాజాగా న్యూజిలాండ్ జట్టుతో అయిదు మ్యాచ్ ల టీ 20 సీరీస్ ని అడుకుతున్న భారత జట్టు మూడో టీ 20, నాలుగో టీ 20 మ్యాచ్ లో విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్లో సక్సెస్ చేతులోకి వచ్చి పోవడంతో ఆ జట్టు నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ హిస్టరీని ఒక్కసారి పరిశీలిస్తే ఈ సూపర్ ఓవర్ ఆ జట్టును చాలా సార్లు ముంచిందనే చెప్పాలి.

ఇప్పటివరకు ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్‌లో ఆడిన న్యూజిలాండ్.. ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. 2010లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఓవర్‌లో మాత్రమే కివీస్ గెలుపొందింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే న్యూజిలాండ్ ఎనమిది సార్లు ఆడిన సూపర్ ఓవర్‌లో ఆ జట్టు బౌలర్ సౌదీ ఏడూ సార్లు బౌలింగ్ చేయగా అందులో న్యూజిలాండ్ ఆరు సార్లు ఓడిపోయింది,. ఒక్క సారి గెలిచింది.

అయిదు మ్యాచ్ ల టీ 20 సీరీస్ లో భారత్ 4-0 తో ముందజలో ఉండి, సిరీస్ ని సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ లు ప్రారంభం కానున్నాయి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories