టీమిండియాతో టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఎంపిక.. షెడ్యూల్ ఇదే..

టీమిండియాతో టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఎంపిక..  షెడ్యూల్ ఇదే..
x
Newzealand Team File Photo
Highlights

జనవరి 24నుంచి టీమిండియా న్యూజిలాండ్ మధ్య ద్వైపక్షిక సీరీస్ జరగనుంది. టీమిండియతో జరగనున్న ఐదు టీ20 ల సీరీస్ కి కివీస్ 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును...

జనవరి 24నుంచి టీమిండియా న్యూజిలాండ్ మధ్య ద్వైపక్షిక సీరీస్ జరగనుంది. టీమిండియతో జరగనున్న ఐదు టీ20 ల సీరీస్ కి కివీస్ 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఐదు టీ20ల సీరీస్ తోపాటు, మూడు వన్డేలు, రెండు టెస్టులు కూడా జరగనున్నాయి. ఈ కీవిస్ జట్టులోకి సీనియర్ ప్లేయర్స్ రాస్‌ టేలర్, మార్టిన్ గప్తిల్ ఈ జట్టులో కివీస్ చోటిచ్చింది. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుండగా..రెండేళ్లుగా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఫాస్ట్ బౌలర్ హమీష్ బెనెట్‌కి టీ20 సిరీస్ జట్టులో చోటు కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యూజిలాండ్ జట్టు బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గుసన్‌లు గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ఘోర పరాజయం పాలైంన సంగతి తెలిసిందే.

ఈ నెల 24న శుక్రవారం ఆక్లాండ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 కూడా ఆక్లాండ్ లోనే 26న జరుగుతుంది. ఆ తర్వాత మూడో t20 29న హామిల్టన్, నాలుగో t20 31న హామిల్టన్ ఇక చివరి టీ20 మ్యాచ్‌ ఫిబ్రవరి 2న బే ఓవల్‌లో నిర్వహిస్తారు. అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం టీమిండియా ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో బీజీగా ఉంది. సిరీస్ లో ముగిసిన అనంతరం భారత్ న్యూజిలాండ్ లో పర్యటించనుంది.

టీ20 జట్టు ఇదే:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, బ్లైర్ టిక్నర్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్(వికెట్ కీపర్), ఐన్ సోధి, టిమ్ సౌథీ, హమీశ్ బెనెట్, టామ్ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్.


Show Full Article
Print Article
Next Story
More Stories