New Zealand: గంగూలీ రికార్డు బ్రేక్‌ చేసిన డేవాన్ కాన్వే..!

New Zealand Opener Dewon Convey Breaks Sourav Gangulys Record
x

గంగూలీ రికార్డు బ్రేక్‌ చేసిన డేవాన్ కాన్వే..! (ఫొటో ట్విట్టర్)

Highlights

New Zealand: లార్డ్స్‌ వేదికగా బుధవారం నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

New Zealand: లార్డ్స్‌ వేదికగా బుధవారం నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు డేవాన్ కాన్వే ఓ రికార్డు నెలకొల్పాడు. దీంతో 25 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ అరుదైన రికార్డు చెరిగిపోయింది.

డేవాన్ కాన్వే.. తొలి టెస్ట్‌లో అరంగేట్రం చేసి.. 136 పరుగులు సాధించాడు. 1996లో ఇదే వేదికపై గంగూలీ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోర్‌ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్‌ మైదానంలో అరంగేట్రంలోనే సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. ఇవేకాక ఈ కివీస్ ఆటగాడు మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున ఫస్ట్‌ మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన 12వ ఆటగాడిగా, అత్యధిక స్కోర్‌ చేసిన 4వ ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.

అయితే, గంగూలీ, డేవాన్ కాన్వేలకు సంబంధించి కొన్ని విషయాలను క్రికెట్ ప్రేమికులు షేర్ చేస్తున్నారు. వీరిద్దరు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్లే కావడం, బౌలింగ్‌లో రైట్‌ హ్యాండ్‌ మీడియం పేసర్లుగా రాణించడం ఒక ఎత్తైతే.. వీరిద్దరి పుట్టిన రోజులు(జులై 8న) కూడా ఒకే రోజు కావడం మరో విశేషం.

ఇక మ్యాచ్ విషయాని వస్తే.. ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి టెస్ట్ మొదలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (240 బంతుల్లో 136 నాటౌట్‌; 16 ఫోర్లు), హెన్రీ నికోల్స్‌ (46 నాటౌట్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 132 పరుగులు జోడించారు. టామ్‌ లాథమ్‌(23), కెప్టెన్‌ విలియమ్సన్‌(13), రాస్‌ టేలర్‌(14) తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్సన్‌ రెండు, అండర్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ కడపటి వార్తలు అందేసరికి డెవాన్ కాన్వే 179 నాటౌట్‌, జమీసన్ 7 నాటౌట్ క్రీజులు ఉన్నారు. 7 వికెట్ల నష్టానికి 314 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories