6వికెట్లు..0 పరుగులు..2ఓవర్లు ప్రపంచ రికార్డు

6వికెట్లు..0 పరుగులు..2ఓవర్లు ప్రపంచ రికార్డు
x
Anjali Chand
Highlights

అంతర్జాతీయ టీ20ల్లో మరో చరిత్ర సృష్టించింది మహిళ క్రికెటర్ అంజలీ చాంద్. నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ పరుగులేమి ఇవ్వకుండా ఆరు వికెట్లు...

అంతర్జాతీయ టీ20ల్లో మరో చరిత్ర సృష్టించింది మహిళ క్రికెటర్ అంజలీ చాంద్. నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ పరుగులేమి ఇవ్వకుండా ఆరు వికెట్లు పడకొట్టి కొత్త రికార్డు నెలకొల్పింది. మాల్దీవులతో నేపాల్ జట్టుకు మధ్య జరిగిన పోరులో అంజలీ చాంద్‌ ఈ రికార్డును అందుకున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన మాల్దీవులు మహిళా జట్టు 16 పరుగులకే కుప్పకూలిపోయింది. అంజలీ చాంద్‌ విసిరిన నిప్పులు చెరిగే బంతులు ఎదుర్కొవడంలో మాల్దీవులు జట్టు 16 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో పరుగులేమి ఇవ్వకుండా ఆరు వికెట్లు తీసిన బౌలర్‌గా అంజలీ చాంద్‌ రికార్డుకెక్కారు. తాను వేసిన 7వ ఓవర్లో మూడు వికెట్లు తీసింది. అలాగే 9వ ఓవర్‌లో రెండు వికెట్లు తీశారు. 11వ ఓవర్లో ఒక వికెట్ తీశారు.

కేవలం 2.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అంజలీ చాంద్ వేసి పరుగులు ఇవ్వకుండా, 6 వికెట్లు తీసుకోవడం విశేషం. నేపాల్‌ జట్టు 17 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 5 బంతుల్లోనే విజయం సాధించింది. సౌతాసియా గేమ్స్‌లో భాగంగా నేపాల్‌, మాల్దీవుల, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు ఈ టోర్నిలో పాల్గొన్నాయి. రౌండ్‌ రాబిన్‌ విధానంలో జరిగే ఈ మ్యాచ్‌ టాప్‌లో జట్లు బంగారు పతకం కోసం పోటీపడనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో జట్లు కాంస్యం కోసం తలపడనున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో సిరీస్ లో టీమిండియా బౌలర్ దీపక్‌ చాహర్‌ 7 పరుగులు ఇచ్చిఆరు వికెట్లు పడగొట్టి మెన్స్ టీ20లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories