Neeraj Chopra: విజయానికి అడుగుదూరంలో నీరజ్ చోప్రా

Neeraj Chopra Reached the Final of the World Athletics Championships 2022
x

Neeraj Chopra: విజయానికి అడుగుదూరంలో నీరజ్ చోప్రా

Highlights

Neeraj Chopra: వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా

Neeraj Chopra: ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోమారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరుకున్నాడు. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన నీరజ్ ప్రస్తుతం 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉంది. తుది పోరులో అతడు ఎంతదూరం జావెలిన్ విసురుతాడనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories