RR vs MI: హోరాహోరీ పోరులో ముంబయిదే విజయం; హాఫ్ సెంచరీతో ఆదుకున్న డికాక్

Mumbai Team Won By 7 Wickets vs RR
x
7 వికెట్ల తేడాతో ముంబయి విజయం (ఫొటో ట్విట్టర్)
Highlights

RR vs MI: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబయి టీం పైచేయి సాధించింది.

RR vs MI: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబయి టీం పైచేయి సాధించింది. రాజస్థాన్ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డికాక్(70 పరుగులు, 50 బంతులు, 6ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ముంబయి టీం ధాటిగానే బ్యాటింగ్ ఆరంభించింది. అయితే క్రీజులు కుదురుకున్నట్లే అనిపించిన రోహిత్ 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 5.6 ఓవర్లో మోరీస్ బౌలింగ్ లో చేతన్ సకారియా కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ పడినా మరో ఓపెనర్ డికాక్ మాత్రం బ్యాట్ ను ఝలిపించాడు. రోహిత్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా హిట్టింగ్ చేశాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రిస్ మోరీస్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇక ఆ తరువాత క్రీజులోకి వచ్చిన క్రునాల్ పాండ్య తో కలిసి డికాక్ 63 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. కఠినంగా మారిన ఈ జోడీని ముస్తఫీజర్ విడదీశాడు. 16.4 ఓవర్లో పాండ్యా (39 పరుగులు, 26 బంతులు, 2ఫోర్లు, 2 సిక్సులు) బౌల్డ్ అయ్యాడు.

ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కీరాన్ పోలార్డ్ (16 పరుగులు, 8 బంతులు, 2ఫోర్లు, 1సిక్స్)భారీ బౌండరీలతో హిట్టింగ్ చేసి ముంబయి టీంను విజయ తీరాలకు చేర్చాడు.

ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరీస్ 2 వికెట్లు, రహామాన్ 1 వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories