ఢిల్లీ క్యాపిటల్స్ ‌పై ముంబై ఘన విజయం...

Mumbai Indians Won Match over Delhi Capitals in IPL 2022 Highlights | Sports News
x

ఢిల్లీ క్యాపిటల్స్ ‌పై ముంబై ఘన విజయం...

Highlights

IPL 2022 - DC vs MI: 5వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్...

IPL 2022 - DC vs MI: కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోల్తా పడింది. అన్ని విభాగాల్లోనూ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్‌ పంత్‌ వ్యూహాత్మక తప్పిదం జట్టు ఓటమి పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 14 పాయింట్లతో ఢిల్లీ నిష్క్రమించగా.. 16 పాయింట్లతో ఉన్న బెంగళూరు ప్లేఆ్‌ఫ్సకు వెళ్లింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. పావెల్‌ 43 , పంత్‌ 39 పరుగులతో రాణించారు. బుమ్రాకు మూడు, రమణ్‌దీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఇషాన్‌ 48 , బ్రెవిస్‌ 37 , డేవిడ్‌ 34 పరుగులతో ఆదుకున్నారు. నోకియా, శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories