కోల్‌కతా ఓటమితో హైదరాబాద్ కు ఊపిరి

కోల్‌కతా ఓటమితో హైదరాబాద్ కు ఊపిరి
x
Highlights

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా...

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. కేకేఆర్‌ ఓపెనర్లు క్రిస్‌ లిన్‌, శుభ్‌మన్‌ గిల్‌లు ప్రారంభించారు. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద ఉండగా గిల్‌(9) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. లిన్‌(41; 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్‌ కావడంతో కేకేఆర్‌ 56 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. దినేశ్‌ కార్తీక్‌(3) నిరాశ పరచగా, రసెల్‌లు డకౌట్‌ కావడంతో ఆ జట్టు స్కోరు పరుగెత్తలేదు. ఈ క్రమంలో రాబిన్‌ ఊతప్ప(40;47 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు, నితీష్‌ రాణా(26; 13 బంతుల్లో 3 సిక్సర్లు) కొద్దిసేపు మెరిపించడంతో.. కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో మలింగా మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు డీకాక్ (23 బంతుల్లో 30 ; 1 ఫోర్, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. దీంతో కేకేఆర్ ఓటమితో హైదరాబాద్ కు ఊపిరి వచ్చింది. కేకేఆర్ ను ఓడించి ముంబై చేసిన మేలుతో నాలుగో జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఎల్లుండి(బుధవారం) విశాఖలో ఢిల్లీ, హైదరాబాద్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories