SA20 2025 Final: ఎట్టకేలకు రూ.16 కోట్ల బహుమతి కొట్టేసిన ముంబై ఇండియన్స్

Mumbai Indians Cape Town Wins SA20 2025 Title Bags ₹16.2 Crore Prize Money
x

SA20 2025 Final: ఎట్టకేలకు రూ.16కోట్ల బహుమతి కొట్టేసిన ముంబై ఇండియన్స్

Highlights

SA20 2025 Final: SA20 లీగ్ మూడవ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్ చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య జరిగింది.

SA20 2025 Final: SA20 లీగ్ మూడవ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్ చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య జరిగింది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు కూడా టైటిల్‌ను గెలుచుకుంది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో ఈ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత ఫైనల్‌ను కూడా గెలుచుకుంది. ఈ విజయం తర్వాత ఆ జట్టుకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కింది.

SA20 2025 ఛాంపియన్‌కు గ్రాండ్ ప్రైజ్

SA20 2025 ఛాంపియన్‌గా నిలిచినందుకు MI కేప్ టౌన్‌కు 34 మిలియన్ ర్యాండ్‌లు, అంటే దాదాపు రూ. 16.2 కోట్ల గ్రాండ్ ప్రైజ్ లభించింది. మరోవైపు, ఫైనల్‌లో ఓడిపోయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా 16.25 మిలియన్ రాండ్ అంటే 7.75 కోట్ల రూపాయలు ఇవ్వబడ్డాయి. దీనితో పాటు సీజన్‌లో మూడవ, నాల్గవ స్థానంలో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.4.24 కోట్లు వచ్చాయి. నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3.74 కోట్ల బహుమతి కూడా ఇచ్చారు.

ప్రతి లీగ్‌లోనూ టైటిళ్లు గెలిచిన రికార్డు

SA20 విజయం MI ఫ్రాంచైజీకి అనేక విధాలుగా ప్రత్యేకమైనది. MI ఫ్రాంచైజీ జట్లు IPL, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ఇంటర్నేషనల్ లీగ్ T20, SA20 లీగ్‌లతో సహా మొత్తం 4 లీగ్‌లలో ఆడతాయి. ఈ లీగ్‌లన్నింటిలోనూ MI ఫ్రాంచైజీ కనీసం ఒక్కసారైనా టైటిల్ గెలుచుకుంది. ఇది కాకుండా T20 లీగ్‌లో MI ఫ్రాంచైజీకి ఇది 11వ టైటిల్.

MI ఫ్రాంచైజీ IPLలో అత్యధికంగా 5 టైటిళ్లను గెలుచుకుంది. ఐపీఎల్‌లో అది 2013, 2015, 2017, 2019, 2020లలో ఛాంపియన్‌గా నిలిచింది. MI 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ 20ని కూడా గెలుచుకుంది. ఇది కాకుండా 2023లో అది మహిళల ప్రీమియర్ లీగ్ , మేజర్ లీగ్ క్రికెట్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2024లో MI ఫ్రాంచైజీ ఇంటర్నేషనల్ లీగ్ T20 టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు SA20లో కూడా విజయాన్ని సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories