సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ కు పరాభవం..

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ కు పరాభవం..
x
Highlights

ఐపీఎల్‌లో ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో విజయం...

ఐపీఎల్‌లో ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో ఛేజింగుకు దిగిన సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దారుణ పరాభవం ఎదురైంది. వరుసగా మూడు విజయాలతో ఊపు మీదున్న ఈ జట్టును పేసర్‌ అల్జారి జోసెఫ్‌ (6/12) తన తొలి మ్యాచ్‌లోనే కట్టడిచేశాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 96 పరుగులకే హైదరాబాద్‌ చతికిల పడింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఈ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్‌ శర్మ(11) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,సూర్యకుమార్‌ యాదవ్‌(7) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.ఆపై కాసేపటికి కుదురుగా ఆడుతున్నట్లు కనిపించిన డీకాక్‌(19) సైతం పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌ పాండ్యా (14; 1 సిక్స్‌) 17వ ఓవర్‌దాకా క్రీజులో ఉన్నా చేసేదేమీ లేకపోయింది. కృనాల్‌ పాండ్యా(6), ఇషాన్‌ కిషన్‌(17) తక్కువ స్కోర్లే చేశారు. రాహుల్‌ చాహర్‌(10)లు లు స్వల్ప స్కోర్ కే ఔట్‌ అయ్యాడు.

ఒకదశలో ముంబై 97 పరుగులకే ఏడు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో అజేయంగా 46 పరుగులు సాధించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇక 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను పేసర్‌ అల్జారి జోసెఫ్‌ దారుణంగా దెబ్బతీశాడు. అతడి బంతులను ఎలా ఆడాలో తెలియక రైజర్స్‌ ఆటగాళ్లు విలవిల్లాడారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(15), బెయిర్‌స్టో(16) తక్కువ స్కోర్లే చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన జోసెఫ్‌ బంతులకు డేవిడ్‌ వార్నర్‌, విజయ్‌ శంకర్‌ (5), హూడా (20), రషీద్‌ (0), భువనేశ్వర్‌ (2)లు బలయ్యారు. ఖాతా తెరవకముందే తానిచ్చిన క్యాచ్‌ను పొలార్డ్‌ వదిలేసినా ఆ అవకాశాన్ని మనీశ్‌ పాండే (16) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. యూసుఫ్‌ పఠాన్‌ డకౌట్‌తో నిరాశపర్చాడు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories