చిక్కుల్లో ధోని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

చిక్కుల్లో ధోని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు
x
మహేంద్రసింగ్ ధోని
Highlights

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్కామ్‌లో ధోనిపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన పలువురు బాధితులు ఈ స్కామ్ లో ధోని పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ధోని పేరును చేర్చారు.

బిల్డర్‌గా అనిల్‌ శర్మ, ధోనికి మంచి పేరుందని వారిని నమ్మే ఫ్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై నమ్మకంతోనే సోమ్ములు చెల్లించామని పేర్కొ్న్నారు. కాగా.. గతంలో రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌‌కు ధోని ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆ సంస్థ పలు ప్లాట్లు అమ్ముతామని బాధితుల వద్ద సోమ్మును సేకరించి దానిని నిబంధలను వ్యతిరేకంగా ఇతర కంపెనీల్లో ఇన్వేస్ట్ చేసింది. ధోని బ్రాండ​అంబాసిడర్‌గా ఉండదంతోనే అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు చేశారు. ‎ఫాట్లు కొనుగోలు చేసిన బాధితులు పలువురు చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు 7ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.

ఈ వ్యవహారాల్లో టీమిండియా క్రికెటర్ ధోని భార్య సాక్షి ధోనికి కంపెనీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే డిపాజిట్లు సేకరించిన రియల్ ఎస్టేట్ సంస్థ అగ్రిమెంట్‌ ప్రకారం సోమ్ము చెల్లించిన వారికి ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2017లో సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రజలనుంచి డబ్బు వసూలు చేసిన ఆ సంస్థ కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించింది. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు సైతం జైలుకు వెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories