ధోనిని వరించిన కొత్త పాత్ర.. ఒప్పుకుంటారా?

Dhoni
x
Dhoni
Highlights

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేధికగా జరగనున్న తొలి డే/నైట్ టెస్టుకు బీసీసీఐ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుంది. నవంబర్‌ 22వ తేదీ జరిగే ఈ మ్యాచ్ కు...

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేధికగా జరగనున్న తొలి డే/నైట్ టెస్టుకు బీసీసీఐ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుంది. నవంబర్‌ 22వ తేదీ జరిగే ఈ మ్యాచ్ కు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. భారత జట్టుకు సేవలందించిన ప్రతి ఆటగాడిని ఆహ్వానించి వారి అనుభవాలు పంచుకోనుంది. బీసీసీఐ- స్టార్‌ స్పోర్ట్స్‌ సంయుక్తంగా మాజీ కెప్టెన్లకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

ఈడెన్ గార్డెన్స్ అనుబంధం ఉన్న న వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. గంగూలీ సారధ్యంలోని టీమిండియా 2001లో ఆసీస్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కీలక భాగస్వామ్యం విజయతీరాలకు చేర్చింది. ఈ టెస్టులో లక్ష్మణ్‌(281) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. డే/నైట్ టెస్టు పుణ్యమా అని భారత లెజెండ్రీ ఆటగాళ్లను మళ్లీ చూసే అవకాశం క్రీడా అభిమానులకు దక్కుతుంది.

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని కామెంటేటర్‌ చేసే అవకాశం ఉంది. వ్యాఖ్యాత పాత్రలో ధోని చూసే అవకాశం ఆయన అభిమానులకు లభిస్తుంది. దీనికి స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యం కూడా అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి. 2019 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యా్చ్ తర్వాత ధోని ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories