MS Dhoni: ధోనీ చీటింగ్‌? అంపైర్‌కు అడ్డంగా దొరికిపోయిన మహేంద్రుడు!

MS Dhoni
x

MS Dhoni: ధోనీ చీటింగ్‌? అంపైర్‌కు అడ్డంగా దొరికిపోయిన మహేంద్రుడు!

Highlights

MS Dhoni: ఎంఎస్ ధోనీ బ్యాట్ పరీక్షలో విఫలమైన సందర్భం ఇది!

MS Dhoni: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయవిహారం కొనసాగుతోంది. శనివారం చెన్నైపై జరిగిన మ్యాచ్‌లో వారు రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ గెలుపును నమోదు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 213 పరుగులు చేయగా, చెన్నై జట్టు చివరి వరకూ పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అది ఎంఎస్ ధోనీ బ్యాట్ పరీక్షలో విఫలమైన సందర్భం.

చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో లుంగి ఎన్గిడి అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన ధోనీకి ఫీల్డ్ అంపైర్ బ్యాట్ గేజ్‌తో పరీక్ష నిర్వహించారు. ఆ గేజ్ ధోనీ బ్యాట్‌ను పూర్తిగా దాటలేదు. దీంతో ధోనీ తానే గేజ్‌ను తీసుకుని తన బ్యాట్‌ను పరిశీలించారు. అయినప్పటికీ, అంపైర్ నుంచి ఆమోదం లభించడంతో ధోనీ ఆ బ్యాట్‌తో ఆడేందుకు అనుమతిచ్చారు.

గతంలో రూపొందించిన ఐసీసీ నిబంధనల ప్రకారం, టి20 ఫార్మాట్‌లో ఉపయోగించే బ్యాట్‌లు నిర్దిష్ట పరిమితులను కలిగి ఉండాలి. గేజ్ ప్రకారం బ్యాట్ మొత్తం మందం 2.68 అంగుళాలు, వెడల్పు 4.33 అంగుళాలు, అంచు మందం 1.61 అంగుళాలు ఉండాలి. అలాగే బ్యాట్ వంకర (కర్వ్) పరిమితి 0.20 అంగుళాల్లో ఉండాలి.

ఈ ఘటన జరిగినప్పటికీ మ్యాచ్‌ను ప్రభావితం చేయలేకపోయింది. చివరి ఓవర్‌లో చెన్నైకు 15 పరుగులు అవసరం కాగా, యాష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై గెలుపు ఆశల్ని నెత్తిన వేపాడు. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌కి చేరింది. ప్లేఆఫ్స్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే అయింది. ఇంకొంచెం ఆలస్యంగా వచ్చిన ధోనీ చివర్లో కొన్ని షాట్లను మిస్ చేశారని తాను స్వయంగా ఒప్పుకోవడం ఈ మ్యాచ్‌ను మరింత చర్చకు తీసుకువచ్చింది. చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి బయటపడిన నేపథ్యంలో ఇది మరో నిరాశే అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories