సీఎంతో కలిసి ఉల్లి కాడలతో ఈల వేసిన ధోని

సీఎంతో కలిసి ఉల్లి కాడలతో ఈల వేసిన ధోని
x
MS Dhoni, Jharkhand CM Soren
Highlights

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ తో కలిసి ఈల వేశారు. జేఎస్‌సీఏ స్టేడియంలో నూతనంగా నిర్మించిన సోలార్‌...

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ తో కలిసి ఈల వేశారు. జేఎస్‌సీఏ స్టేడియంలో నూతనంగా నిర్మించిన సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ, సీడీ ఫిట్‌నెస్‌ క్లబ్‌, అధునాతన హంగులతో కూడిన జిమ్‌, అప్‌టౌన్‌ కేఫ్‌ నిర్మించారు. ఈ సందర్బంగా కార్యక్రమనికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ధోని, పలువురు క్రీడాకారులు హాజరయ్యారు. అయితే స్టేడియంలో పలు ఆశక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ధోని మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉల్లికాడలతో పదేపదే ఈలలు వేసేందుకు సీఎం హేమంత్ సోరెన్, ధోని ప్రయత్నించారు.

జార్ఖండ్ స్టేడియంలో ప్రారంభించిన నూతన రెస్టారెంట్లో హేమంత్‌, ధోనీ సహా ప్రముఖులు కాఫీ సేవించారు. అక్కడే ఉన్న ఉల్లి కాడలతో వీరిద్దరూ ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. మహేంద్రసింగ్‌ ధోనీ చాలాసార్లు అలా చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల్లో గెలిచినందుకు హెమంత్ సోరెన్‌కు ధోని శుభాకాంక్షలు తెలియజేశారు. హేమంత్ సోరెన్ మౌలిక వసతులను పెద్దపీట వేస్తునందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హేమంత్‌ నాయకత్వంలో రాష్ట్రం ఘనత అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని అభిలాషించారు. ఆటగాళ్లందరూ బాగా ప్రాక్టీస్ చేయాలని రంజీ మ్యాచ్ ల్లో రాణించి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ధోని సూచించారు. అనంతరం సీఎం హేమంత్ సోరేన్ మాట్లాడుతూ.. ఈ స్టేడియం పునాదులు గురూజీ శిబు సొరెన్ వేశారు. బాటలోనే నడిచి రాష్ట్రాన్నిమరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానాను అని అన్నారు.

2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ధోని తిరిగి టీమిండియా తరపున ఆడలేదు. ధోని తన పునరాగమనంపై జనవరి వరుకు ఎవరు ప్రశ్నించ వద్దని కోరారు. జనవరిలో తాను పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ధోని నోరు మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తాజాగా బీసీసీఐ కాంట్రాక్టు విషయంలో ధోని పేరు లేకపోవడం విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories