ఐపీఎల్ : 13 ఏళ్లలో ధోని ఎంత తీసుకున్నాడో తెలుసా?

ఐపీఎల్ : 13 ఏళ్లలో ధోని ఎంత తీసుకున్నాడో తెలుసా?
x
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ఐపీఎల్ అంటేనే అందరిపై కాసుల వర్షం కురుస్తుంటుంది. బీసీసీఐ, ప్రసారకర్తలకు భారీ ఆదాయం రానుండగా ఆటగాళ్లను కూడా రాత్రికిరాత్రే కోటేశ్వరులను చేస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ఐపీఎల్ అంటేనే అందరిపై కాసుల వర్షం కురుస్తుంటుంది. బీసీసీఐ, ప్రసారకర్తలకు భారీ ఆదాయం రానుండగా ఆటగాళ్లను కూడా రాత్రికిరాత్రే కోటేశ్వరులను చేస్తోంది. ఇక ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఈ 13 ఏళ్లలో అందరికంటే ఎక్కువగా సంపాదించాడు. మొత్తంగా ఇప్పటి వరకూ 13 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఐపీఎల్ ఒప్పందాల ద్వారా మహీ రూ.137 కోట్లు ఆర్జించాడు. ఐపీఎల్‌లో గత మూడేళ్ల నుంచి ఏటా రూ.17 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ నుంచి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 126 కోట్లు ఆర్జించాడు. 131కోట్ల ఆర్జనతో రోహిత్ శర్మ కోహ్లీ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడు.

ఐపీఎల్ ప్రారంభమైన మొదటి ఏడాదికి రూ.6 కోట్లు తీసుకున్న ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్ నాటికి 15 కోట్లు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2008 సీజన్ వేలంలో రూ.6 కోట్లకి ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ధోనీ మూడేళ్లు అదే ధరకి కొనసాగాడు. 2011 నుంచి 13 వరకు రూ.8. కోట్లు ఆర్జించాడు. 2014 నుంచి 2017 వరకూ 12.5 కోట్లు తీసుకున్నాడు. ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్‌లో చెన్నై జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ధోనీ ఆడాడు. 2018లో మళ్లీ ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ రీఎంట్రీ ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ ధర రూ.15 కోట్లకి పెరిగింది. అప్పటి నుంచి అదే ధరకి కొనసాగుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories