అరంగేట్ర వన్డేలో జీరో.. అనంతరం డైనమేట్‌లా పేలిన భారత మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా?

MS Dhoni Debut on This Day in ODI Format and Dismissal at Zero | Cricket News Today
x

అరంగేట్ర వన్డేలో జీరో.. అనంతరం డైనమేట్‌లా పేలిన భారత మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా?

Highlights

MS Dhoni: టీమ్ ఇండియాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ పేరు కచ్చితంగా ఉంటుంది...

MS Dhoni: టీమ్ ఇండియాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రపంచకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో ధోనీ భారత్‌ను విజయతీరాలకు చేర్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్‌గా నిలిపాడు. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతని అరంగేట్రం మాత్రం జీరోతో మొదలైంది. 2004లో ఈ రోజు అంటే డిసెంబర్ 23న ధోని వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరాడు. దీని తర్వాత రెండో వన్డేలో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక దీని తరువాత ధోని ఇన్సింగ్స్‌కు బ్రేకులు పడలేదు. అద్భుతంగా ఆడుతూ తనదైన స్టైయి‌ల్‌లో మాంచి ఫినిషింగ్‌లు ఇస్తూ కీర్తి గడించాడు.

నిజానికి 2004లో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. ఇక్కడ ధోని మూడు వన్డేల సిరీస్ ఆడాడు. ఈ సిరీస్‌తోనే మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం సిద్ధమయ్యాడు. డిసెంబరు 23న చిట్టగాంగ్‌లో జరిగిన వన్డేలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ జార్ఖండ్ డైనమేట్ మొదటి బంతికే రనౌట్ అయ్యాడు. ఇక డిసెంబర్ 26న ఢాకాలో జరిగిన రెండో వన్డేలో ధోనీ 11 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మష్రఫే ముర్జాతా అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో వన్డేలో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఓ సిక్సర్ కొట్టి మంచి ఫినిషింగ్ అందిచాడు.

2004 బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ధోనీ కొంత సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ధోనీ స్వేచ్ఛగా ఆడడం మొదలుపెట్టి, స్టార్ ప్లేయర్‌గా తన ప్రయాణాన్ని టీమిండియాలో లిఖించుకున్నాడు. ధోని తన కెప్టెన్సీలో మూడు ప్రధాన ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియాను విజయ తీరాలకు నడిపించాడు. 2007లో ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచి, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలో చాంపియన్‌గా అవతరించింది.

ఓవరాల్‌గా ధోనీ రికార్డును పరిశీలిస్తే 90 టెస్టు మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో ధోనీ 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు చేశాడు. మహి 350 వన్డేల్లో 10773 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోనీ 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ టీ20లో 98 మ్యాచ్‌లు ఆడి 1617 పరుగులు చేశాడు. అతని వికెట్ కీపింగ్ రికార్డు కూడా బలంగానే ఉంది. ధోని టెస్టుల్లో 38, వన్డేల్లో 123, టీ20ల్లో 34 స్టంప్‌ ఔట్‌లు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories