జో రూట్ 5 వికెట్లు తీయడమంటేనే పిచ్ లో తప్పున్నట్లు: వెంగ్‌సర్కార్

దిలీప్ వెంగ్‌సర్కార్ (ఫోటో వికీపీడియా )
Pitch Criticism: మొతేరా పిచ్ టెస్ట్ క్రికెట్ కు పనికిరాదని మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pitch Criticism: మొతేరా పిచ్ టెస్ట్ క్రికెట్ కు పనికిరాదని ఓ వైపు ఇంగ్లాండ్ మీడియాతోపాటు మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మాజీ భారత ఆటగాళ్లు కూడా పిచ్ లో ఏదో తప్పు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. తాజాగా మొతెరా పిచ్‌లో పెద్ద తప్పిదం ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అంటున్నాడు. భారత్, ఇంగ్లాండ్ టీంల మధ్య ఇటీవల అహ్మదాబాద్‌లోని మొతెరా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్.. రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా.. టీం ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ (11/70) దెబ్బకి ఇంగ్లాండ్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా.. నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి మొతెరా వేదికగానే జరగనుంది.
టెస్టు క్రికెట్‌కి మొతేరా పిచ్ అనువైంది కాదని ఇప్పటికే హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడగా.. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఆ పిచ్‌పై పెదవి విరిచాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా మొతెరా పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ బౌలర్‌గా ఉన్న జో రూట్.. 8 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీయడమే ఈ పిచ్ లో తేడా ఉందని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.
మొతెరా పిచ్ ప్రమాణాలకి తగినట్లు లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాల్లేవు. ఇలాంటి పిచ్‌లు టెస్టు క్రికెట్‌కి అంత మంచిది కాదు. భారత్, ఇంగ్లాండ్ జట్లులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. జో రూట్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్.. బౌలర్ అవతారమెత్తి 5 వికెట్లు తీశాడంటేనే పిచ్‌లో పెద్ద తప్పిదం ఉందని తెలిసిపోతోంది'' అని వెంగ్‌సర్కార్ వెల్లడించాడు. భారత్ తరఫున వెంగ్‌సర్కార్ 116 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే
1 July 2022 2:34 AM GMTనేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్
1 July 2022 2:15 AM GMTLittle Gold Smugglers: చిన్న బంగారం దొంగలు
1 July 2022 1:40 AM GMTబీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
1 July 2022 12:56 AM GMTHealth Tips: ఆరోగ్యంగా ఉండాలంటే పురుషులు ఈ 3 పనులు చేయాల్సిందే..!
30 Jun 2022 3:30 PM GMT