
Monank Patel: ఆ ఒక్క క్యాచ్ పట్టుంటే.. భారత్‌పై గెలిచేవాళ్లం!
Monank Patel: టీ20 ప్రపంచకప్ 2026లో ఆతిథ్య భారత్‌పై ఓటమి అనంతరం అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Monank Patel: టీ20 ప్రపంచకప్ 2026లో ఆతిథ్య భారత్‌పై ఓటమి అనంతరం అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టాప్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం వల్లే తాము ఓటమి పాలయ్యామని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ (84; 49 బంతుల్లో 10×4, 4×6) క్యాచ్ మిస్ చేయడం వల్లే ఓడిపోయామని స్పష్టం చేశాడు. తమ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారని, తమ టాప్ బ్యాటర్ల వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని మోనాంక్ తెలిపాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను శుభమ్ రంజనే అందుకోలేకపోయాడు. వాంఖడే మైదానంలో శనివారం రాత్రి టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 29 పరుగుల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ... 'మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. మేం కొన్ని క్యాచ్‌లు వదిలేశాం. సూర్య క్యాచ్ పట్టుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ పిచ్‌పై 160 పరుగులు మంచి స్కోర్. ఈజీగా ఛేదించవచ్చని భావించాము. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆరంభంలోనే వికెట్లు పడిపోవడం వల్ల మేం గేమ్‌లో చాలా వెనుకబడ్డాం. అదే మా పరాజయానికి ప్రధాన కారణం. ఆ దశలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే భాగస్వామ్యం లేకపోవడం జట్టును ఒత్తిడిలోకి నెట్టింది' అని చెప్పాడు.
'ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ గాయపడటంతో అతడు పూర్తి ఓవర్లు వేయలేకపోయాడు. దాంతో బౌలింగ్ కాంబినేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్ లాంటి బలమైన జట్టుతో పోరాడడం మరింత కష్టంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారత్ లాంటి పెద్ద జట్టు ఇలాంటి ఒత్తిడిని కూడా తట్టుకుని విజయం సాధించగలిగింది.. అంటే అది అతని ఇన్నింగ్స్ వల్లే. ఈ మ్యాచ్‌ను పూర్తిగా మరిచిపోతాం. ఇకపై మా పూర్తి దృష్టి తదుపరి మ్యాచ్‌పైనే ఉంటుంది. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, వచ్చే మ్యాచ్‌లో మెరుగైన ఆటతో గెలవడానికి ప్రయత్నిస్తాం' అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు. భారత్‌పై పరాజయం ఎదురైనా.. అమెరికా జట్టు ఇచ్చిన పోటీ, మోనాంక్ పటేల్ చూపించిన నిజాయితీ గల విశ్లేషణ క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




