షమీని చూస్తే అతడు గుర్తుకొస్తున్నాడు :సునీల్ గవాస్కర్

షమీని చూస్తే అతడు గుర్తుకొస్తున్నాడు :సునీల్ గవాస్కర్
x
Mohammed Shami File Photo
Highlights

భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్‌ మహ్మాద్ షమీపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు

భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్‌ మహ్మాద్ షమీపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్ వేసే సమయంలో షమీని చూస్తే చిరుతపులిలా ఉన్నాడని వ్యాఖ్యానించారు. షమీ విండీస్ మాజీ క్రికెటర్ మాల్కమ్ మార్షల్ గుర్తుకొస్తున్నారి తెలిపారు. కటక్ వేదికగా ఆదివారం విండీస్‌తో జరిగిన మూడోవన్డేలో 316 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అంతే కాకుండా మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ కు స్పోర్ట్స్ ఛానెల్‌ ప్రత్యేక్ష ప్రసారం చేసింది. స్పోర్ట్స్ ఛానెల్‌ తో మాట్లాడిన గవాస్కర్ .. విండీస్ దిగ్గజ బౌలర్‌ మాల్కమ్‌ మార్షల్‌ తన బౌలింగ్ తో ఇబ్బందులు పెట్టారని, అతని బౌలింగ్ ఎదుర్కొవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నారు. నిద్రలో కూడా ఉలిక్కి పడి లేచేలా మాల్కమ్ మార్షల్ బౌలింగ్ ఉండేదని గుర్తు చేశారు. టీమిండియా బౌలర్ షమీ కూడా అతన్ని గుర్తు చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. షమీ బౌలింగ్ వేసేందుకు పరిగెడుతుంటే ఆకలితో ఉన్న చిరుత పులి వేటకు వెళ్తున్నాట్లు అనిపిస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు.

అయితే ఆదివారం జరిగిన మూడో వన్డేలో షమీ 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి ఓ వికె ట్ తీశాడు. షమీ ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. . 21 ఇన్నింగ్స్‌ల్లో 42 వికెట్లు టాప్ బౌలర్‌గా నిలిచాడు. 2014లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు ఎక్కాడు. ఇక టీమిండియా తరఫున 56 వన్డేల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ కూడా షమీనే. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షమీపై ప్రశంసించడం ఇది రెండో సారి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories