టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ దాటిన మహ్మద్ షమీ.. 11వ భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు..!

Mohammed Shami Reaches 200 Test Wickets
x

టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ దాటిన మహ్మద్ షమీ.. 11వ భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు..!

Highlights

టెస్టు క్రికెట్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 11వ టీమిండియా బౌలర్‌గా మహమ్మద్ షమీ మారాడు.

Mohammed Shami: సెంచూరియన్‌లో జరగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన పేరిట ఓ స్పెషల్ రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఈ భారత ఫాస్ట్ బౌలర్ 200 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల లిస్టులో 11వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఈ ఘనత సాధించారు.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ భారత్‌కు అత్యధికంగా 5 వికెట్లు అందించి, సౌతాఫ్రికాను తక్కువ పరుగులకే పెవిలయన్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో షమీ 16 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 ఓవర్లు మెయిడిన్‌గా సంధించాడు. మొత్తంగా అద్భుత ప్రదర్శనతో షమీ టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ టీమిండియా బౌలర్‌గా నిలవడం విశేషం.

టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. కుంబ్లే 132 మ్యాచుల్లో 619 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక మరో భారత దిగ్గజ ఆల్‌‌రౌండర్ కపిల్ దేవ్ 131 మ్యాచ్‌ల్లో 434 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. నేటి తరం బౌలర్లలో భారత స్పిన్నర్ ఆర్. అశ్విన్ 82 మ్యాచ్‌ల్లో 427 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మరో స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 వికెట్లు, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ 311 వికెట్లు, మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 311 వికెట్లు, రవీంద్ర జడేజా 232 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ప్రస్తుతం షమీ కూడా చేరాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories