Mohammed Shami: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టులోకి షమీకి అవకాశాలు పెరిగాయి!

Mohammed Shami: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టులోకి షమీకి అవకాశాలు పెరిగాయి!
x
Highlights

టీమ్‌ ఇండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ జట్టులోకి వచ్చేందుకు అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయనున్నారన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

టీమ్‌ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్లీ బ్లూ జెర్సీ తొడుక్కోనున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ తర్వాత ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన షమీ, దేశవాళీ క్రికెట్‌లో చేస్తున్న అద్భుతమైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మళ్లీ ఆకర్షించాడు.

జనవరి 11 నుంచి భారత్‌లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు షమీని ఎంపిక చేసే అవకాశం ఉందన్న సమాచారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బీసీసీఐ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఫిట్‌నెస్‌పై నిశిత పరిశీలన

బీసీసీఐ వర్గాల ప్రకారం, సెలక్టర్లు షమీ ఫామ్‌ను గమనిస్తూనే, అతడి ఫిట్‌నెస్‌పై సమగ్రంగా పరిశీలిస్తున్నారట.

"షమీ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. అతడి ఫిట్‌నెస్‌పై క్లారిటీ వస్తే, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం ఆశ్చర్యకరం కాదు. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా అతనికి అవకాశం ఉంటుంది" అని వర్గాలు అంటున్నాయి.

టెస్టులు–టీ20లకు దూరం, వన్డేల్లో తిరిగి అవకాశం?

వన్డే వరల్డ్‌కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు.

  • WTC 2023 ఫైనల్‌ తర్వాత టెస్టులకు దూరం
  • చివరిసారిగా టీ20లో ఫిబ్రవరి 2, 2025న ఇంగ్లాండ్‌పై ఆడాడు
  • టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో చోటు దక్కలేదు

దేశవాళీల్లో షమీ దుమ్మురేపుతున్న ప్రదర్శన

  • విజయ్ హజారే ట్రోఫీ: 3 మ్యాచ్‌లు – 6 వికెట్లు
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 7 మ్యాచ్‌లు – 16 వికెట్లు

ఈ అద్భుతమైన ఫార్మ్‌తో అతడిని తిరిగి వన్డే జట్టులోకి తీసుకునే అవకాశాలు బలపడినట్లు తెలుస్తోంది. పైగా జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారన్న వార్తలు మరింత చర్చకు కారణమయ్యాయి.

మొత్తానికి, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో షమీ పేరుంది అంటే అభిమానులకు ఇది కొత్త సంవత్సర గిఫ్ట్‌ అనే చెప్పాలి!

Show Full Article
Print Article
Next Story
More Stories