కీలక వన్డేలో షమీని ఎందుకు పక్కన పెట్టారు?

కీలక వన్డేలో షమీని ఎందుకు పక్కన పెట్టారు?
x
Mohammed Shami File Photo
Highlights

కివీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది .

కివీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది . కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీలను తప్పించి వారి స్థానాల్లో యువ బౌలర్లు చహల్‌, నవదీప్ సైనీలకు అవకాశం ఇచ్చింది. అయితే టీమిండియా సినీయర్ బౌలర్ మహ్మద్‌ షమీని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది. గత మ్యాచ్‌లో షమీ 9.1 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఒక వికెట్‌ సాధించాడు. శార్దూల్‌ కంటే ఎంతో అనుభవం ఉన్న షమీకి తుది జట్టులోకి తీసుకోలేదు.

షమీ కంటే ప్రదర్శనే శార్దూల్‌ ఠాకూర్‌ మెరుగ్గా లేదు. శార్దూల్‌ 9 ఓవర్లలో 80 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌ భారత్‌ ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు ఇచ్చిన బౌలర్లలో శార్దూలే ఉన్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ శార్దూల్‌ను రెండో వన్డేలో కొనసాగించడానికి మొగ్గుచూపిన‌ షమీని మాత్రం పక్కకు పెట్టింది. టెస్ట్ సిరీస్ కోసం షమీకి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ కోహ్లీ చెబుతున్నాడు

కుల్దీప్‌ యాదవ్ గత మ్యాచ్ లో రెండు వికెట్లు సాధించినా 10 ఓవర్లలో 84 పరుగులు సర్పించాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులిచ్చిన మూడో స్పిన్నర్‌గా చెత్త రికార్డును ‍ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్‌కు రెండో వన్డేలో ఉద్వాసన తప్పదని ముందే ఊహించారు.

సిరీస్ రేసులో నిలవాలంటే మ్యాచ్‌లో భారత్ తప్పక నెగ్గాల్సిన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మొదట టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ చెప్పాడు. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో స్పిన్నర్‌ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories